కన్నెపల్లి, మే 20 : అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం నూతన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని ప్రొఫెసర్, ఎస్ఐఈటీ రాష్ట్ర ఇన్చార్జి అధికారి డాక్టర్ రవికాంత్‌రావు అన్నారు. కన్నెపల్లి మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ, సఖీ, ల యన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్షరాస్యత, కుట్టు శిక్షణ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు.
కొన్నేండ్లుగా రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమాలు అధికారికంగా ముగిసినప్పటికీ మంచిర్యాల జిల్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేం ద్రాల్లో అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్నది, ఇందుకు కృషిచేస్తున్న జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు, 8,9, 10 తరగతుల విద్యార్థులు కూడా నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని, వంద శాతం అక్షరాస్యత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, కన్నెపల్లి బ్యాంక్ అధికారి గురుమూర్తి, సఖీ లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు బండ శాంకరి, డీఆర్పీలు సువర్ణ, ప్రకాశం, వెంకటేశ్వర్లు, మహిళలు పాల్గొన్నారు.
మందమర్రి, మే 20 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్ కాలనీలో వయోజన విద్యా శాఖ, ల యన్స్ క్లబ్ మంచిర్యాల సఖీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రవికాంత్ రావు సందర్శించారు. వయోజన విద్యా కేంద్రం అభ్యాసకులతో మాట్లా డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ తీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వో ఎస్ఎన్ మూర్తి, డీఆర్పీలు సుందిళ్ల రమేశ్, శిక్షణ కేంద్రం కో-ఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, కన్వీనర్ ఉప్పులేటి నరేశ్, ట్రైనర్ శారద పాల్గొన్నారు.