కోటపల్లి : వర్షాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ధాన్యం కొనుగోళ్ల లో (Grain procurement ) వేగం పెంచాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ (Additional Collector Motilal ) అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం సర్వాయిపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.
వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులను ఇబ్బందులు గురి చేయవద్దని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ రాఘవేంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.