ఆసిఫాబాద్ టౌన్, మే 15 : రానున్న వర్షాకాలం నేపథ్యంలో విపత్తుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి అప్పయ్యతో కలిసి హాజరయ్యారు. సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చి జన జీవనం స్తంభిస్తుందని, అలాంటి సమయంలో చాకచక్యంగా ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, యువత పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లోని జిల్లా గ్రంథాలయంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఈవో లలితతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు పొందాలని సూచించారు. కౌన్సిలర్లు, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.