అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులుసహా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల ఎదుట సందడి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాద్‌లో జోగు రామన్న, బోథ్‌లో అనిల్ జాదవ్, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో జాన్సన్ నాయక్, మంచిర్యాలలో దివాకర్‌రావు, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూర్‌లో బాల్క సుమన్, ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప నామినేషన్లు వేశారు.
ఈ నెల 13వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తి కానుండగా, నామినేషన్ల ఉపసంహరణ 15తో ముగియనుంది. పార్టీల బీ-ఫామ్‌లు ఉన్న వారిని మాత్రమే ఆ పార్టీల అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకుంటామని, బీ-ఫామ్‌లు లేని వారిని స్వతంత్ర అభ్యర్థులుగా తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
– మంచిర్యాల, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)