ఎదులాపురం, ఫిబ్రవరి 13 : ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత నిర్దేశించిన రోజు మాత్రమే గెలుపొందిన వార్డు సభ్యులు ర్యాలీలు నిర్వహించాలని ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో 44వ వార్డు లో కౌన్సిలర్‌గా గెలుపొందిన అభ్యర్థికి అనుకూలంగా డీజే ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ షే క్ షోహేబ్, షేక్ ఇమ్రాన్ గెలిచిన అభ్యర్థి మహమ్మద్ రోహిత్‌పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అను మతులు లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు గాను ముగ్గురితోపాటు పాల్గొన్న వారిపై రోడ్డు ను అడ్డగించినందుకుగాను సౌండ్ పొల్యూషన్‌తోపాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.