వాంకిడి, ఏప్రిల్ 19 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను బుధవారం ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సిబ్బంది గతంలో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఫైరింగ్ రేంజ్లో శిక్షణ తీసుకునే వారన్నారు.
రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ఎస్పీ సురేశ్‌కుమార్ చొరవతో వాంకిడి ఠాణా పరిధిలోని ఇందాని గ్రామ శివారులో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతకముందు ఐజీ, ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీలు ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు,జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ భీమ్రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, వాంకిడి సీఐ శ్రీనివాస్, టాస్‌ఫోర్స్ సీఐ సుధాకర్, వాంకిడి ఎస్ఐ సాగర్ పాల్గొన్నారు.