బెల్లంపల్లి, ఆగస్టు 1 : బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానను మూసివేస్తే ఊరుకునేది లేదని, ఆ యత్నాన్ని ఉప సంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాం డ్ చేశారు. ఈ మేరకు గురువారం బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా దవాఖాన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరాహరదీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దవాఖానను పూర్తిగా మూసివేసేందుకు సింగరేణి యాజమాన్యం కుట్రలు పన్నుతోందన్నారు. 20రోజుల నుంచి ఫార్మసీ స్టోర్, పురుషుల, మహిళా వార్డులను మూసివేశారని తెలిపారు. క్యాజువాల్టీ వార్డులో నామమాత్రంగా చికిత్స అందిస్తున్నారని, ఇక్కడికి వచ్చే రోగులను రామకృష్ణాపూర్, గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానలకు రెఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యు లు, సిబ్బంది, నర్సులు, పారిశుధ్య కార్మికు లు, ఆయాలు లేక కేవలం ఇద్దరు సిస్టర్లతో దవాఖానను కొనసాగిస్తున్నారని మండిపడ్డా రు. ఈ కార్యక్రమంలో సింగరేణి దవాఖాన పరిరక్షణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.