లక్ష్మణచాంద : జమ్మూ కశ్మీర్ పహల్గాంలో( Pahalgam) జరిగిన దాడి పిరికిపందల చర్య అని మండలంలోని ముస్లిములు(Muslims) పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం వారు మాట్లాడుతూ పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. భారతదేశం లాంటి లౌకిక రాజ్యంలో మతాన్ని బట్టి దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మృతులకు సంఘీభావంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, సేవ్ కశ్మీర్ ,మతం కంటే మానవత్వం గొప్పదని నినాదాలు చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతీయులందరమూ కలిసి కట్టుగా ఉండి , దాడులను తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అల్లాని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణచాంద జామా మసీదు కమిటీ సభ్యులు, మజీద్ ఇమామ్ అబ్రార్, మొహమ్మద్ ఆదిల్, మహమ్మద్ షఫీ, సిరాజ్, అస్గర్, అజార్, అఫ్జల్, దిల్షాద్, షాదుల్లా , గ్రామస్థులు పాల్గొన్నారు.