శ్రీరాంపూర్/సీసీసీనస్పూర్/మందమర్రి, ఆగస్టు 20: టీబీజీకేఎస్ గౌ రవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణా భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో టీబీజీకేఎస్ తీర్మానం మేరకు యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. జాగృతిలో పనిచేస్తూ యూనియన్‌లో కొనసాగుతున్న ఎల్ వెంకటేశ్(గోదావరిఖని), నరేశ్(భూపాల్పల్లి)ని టీబీజీకేఎస్ యూనియన్ నుంచి తొలగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. రెండు విభాగాల్లో పనిచేయడం కుదరదని నాయకులు చెప్పారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్‌కు అభినందనలు తెలుపుతూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, పుట్ట మధు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కాపు కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు కొమురయ్య, బండి రమేశ్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, వివిధ ఏరియాల నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియా నుంచి..
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బడికెల సంపత్ కుమార్, సీహెచ్. వెంకటరమణ, ఒడ్నాల రాజన్న, దాసరి శ్రీనివాస్, బాపూరావు, బీ.రమేశ్, బెల్లం అశోక్, కొట్టు రమేశ్, బడికెల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.