నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రాథోడ్ అలేఖ్య ( Rathod Alekya ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( IISER ) కు ఎంపిక కావడం హర్షనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు విద్యార్థికి శాలువాతో సన్మానించి అభినందించారు.
ప్రిన్సిపల్ మాట్లాడుతూ అలేఖ్య బీఎం-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కు ఎంపికవ్వడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. విద్యార్థులు నిరంతరం కృషి పట్టుదలతో చదువుకొని లక్ష్యాన్ని సులువుగా సాధించగలుగుతారన్నారు. అలేఖ్యను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.