ఎదులాపురం, ఆగస్టు 31 : రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించా రు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడనుందని, వాయుగుండంగా మారే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వ ర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాను న్న రెండు రోజులు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఉండాలని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటలు, రహదారులు, వంతెనలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ము న్సిపల్ సిబ్బంది పాత భవనాలు, ఇండ్లు, గో డలు వర్షానికి కూలిపోయే దశలో ఉన్న వారిని గుర్తించి ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా అధికారులతో మాట్లాడుతూ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939, ఆర్అండ్బీ కంట్రోల్ రూమ్ నంబర్ 8106128195, ఇరిగేషన్ కంట్రోల్ రూమ్ నంబర్ 91873226050 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు పాల్గొన్నారు.
రెండు రోజులు భారీ వర్షాలు
రానున్న రెం డు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురి సే ఆస్కారం ఉండడంతో జిల్లాలోని ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, రై తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువులు, వాగుల పరిసరాల్లోకి పశువుల ను తీసుకెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్ర జలను అప్రమత్తం చేస్తూ అధికారులు స హాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.