ఆదిలాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉట్నూర్‌లో అధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షం పడింది.
ఇచ్చోడలో 10.3, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 10.2, గుడిహత్నూర్‌లో 9.6, తలమడుగులో 9.2, మావలలో 8.8, నార్నూర్‌లో 8.6, సిరికొండలో 8.5, తాంసిలో 7.4, బజార్హత్నూర్లో 6.7, బేలలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తర్నం వాగు పొంగి ప్రవహించడంతో జైనథ్, బేల మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.