ఎదులాపురం, మార్చి 10 : రూ.42 లక్షల 420 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన పవర్ మాధవ్(ఏ-1) ఇచ్చోడ మండలంలోని హీరాపూర్ గ్రామంలోని తొమ్మిదెకరాల శనగ పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేయగా.. నలుగురి వద్ద నుంచి గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. పవర్ మాధవ్ వద్ద 390, మిగిలినవి ఇచ్చోడకు చెందిన ఆత్రం దత్తాత్రి(ఏ2), షేక్ ముజాయిద్(ఏ3), షేక్ అరిఫ్(ఏ4)ల వద్ద పది గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు.