అభివృద్ధికే పట్టం కట్టండి
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టం కట్టండని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి జాదవ్ అనిల్
- పార్టీలో బీజేపీ నాయకుల చేరిక
నేరడిగొండ, సెప్టెంబర్ 19 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టం కట్టండని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చోడ మం డలం ముక్రా కే, ముక్రా బీ గ్రామాలకు చెందిన బీజేపీ నా యకులు సోమవారం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని పే ర్కొన్నారు. అలాంటి నాయకుడిని ప్రజలు మూడో సారి ము ఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. మండలంలోని కుమారి గ్రామానికి చెందిన యువజన సంఘం అధ్యక్షుడు కొత్తపెల్లి భూమన్న, బిక్క అడెల్లు, కొత్తపెల్లి ప్రవీణ్, గజ్జెల గంగాధర్, బూతి అడెల్లు, ఊశన్న, అమరేశ్, నవీన్, వంశీ తదితరులు కలిసి నేరడిగొండలోని ఆయన నివాసంలో కలిసి శాలువా కప్పి సన్మానించారు. ముక్రా ఎంపీటీసీ గాడ్గె సుభాష్, బీజేపీ నాయకులు పవార్ జనార్దన్, బీ సాయినాథ్, సీహెచ్ రాంచందర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాండురంగ్, మహేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

