ఎదులాపురం, జూన్ 29 : గణాంకాలు, ఆర్థిక ప్రణాళిక రంగంలో మహాలనోబిస్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రశాంత చంద్ర మహాలనోబిస్ జయంతిని పురసరించుకుని 19వ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ చైన్‌గేట్, జూన్ 29 : గణాంక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ మహలనోబిస్ సేవలు చిరస్మరణీయమని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ 2023-24 సంవత్సరానికి గాను జిల్లా గణాంక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు.