నార్నూర్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ( Cooperative societies ) చైర్మన్ పదవి కాలం పొడగించడం పట్ల నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ ( Suresh ) హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సహకార సంఘం చైర్మన్ పదవి నిన్నటితో ముగియడంతో ప్రభుత్వం స్పందించి మరో ఆరు నెలల పాటు పొడగించి హర్షనీయమని పేర్కొన్నారు. సహకార సంఘాలు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి బొజ్జ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దుర్గారావు, సీఈవో ఆడే గణేష్, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.