నస్పూర్, అక్టోబర్ 2 : మహాత్మా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అహింస, శాంతి మార్గంలో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మహాత్మాగాంధీ కృషి చేశారని కొనియాడారు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని ఆయన చెప్పిన మాటలను ఆచరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల ఆధ్వర్యంలో..
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 2 : జిల్లా కేం ద్రంలో గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం గాంధీ జయంతిని పు రస్కరించుకొని మంచిర్యాల మార్కెట్లో గాంధీ పార్క్‌లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గాంధీజీ పోరాటం స్ఫూర్తిదాయకం
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 2 : భారత దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మా ర్గాన్ని అనుసరించిన మహాత్మా గాంధీజీ చేసిన పోరాటం ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కుమ్రం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో శాంతియుతమార్గాన్ని అనుసరించి అనేక పోరాటాలు చేశారని, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎందరో నాయకులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.