వాంకిడి : సంత్ గాడ్గే బాబా (Gadge Baba) కర్మయోగి 149వ జయంతిని వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో ఆదివారం అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాడ్గే బాబా చిత్రపటం వద్ద బుద్ద వందన నిర్వహించి నివాళులర్పించా రు.
ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహా సభ కొమురం భీం జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్( Ashok Mahulkar) మాట్లాడుతూ స్వచ్ఛత ప్రవక్త, అంటరాని తనం నిర్మూలనకు, మూఢనమ్మ కాలను పారద్రోలేందుకు కృషి చేసిన సంత్ గాడ్గే బాబా కర్మయోగి అని కొనియాడారు.
బాబా తన జీవితాంతం సమాజహితం కోసం పాటుపడ్డారని కొనియాడారు. గాడ్గే బాబా సంఘ సంస్కరణ కార్యక్రమాలను చూసి అంబేద్కర్ సైతం తన సమావేశాలకు ఆహ్వానించేవారని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు విజయ్,సందీప్ , ప్రతాప్, రోషన్, చింటూ,రమేష్ ప్రకాష్, ఇంద్రజిత్,భిమరావు ,నాగ్ సేన్ ఉప్రే తదితరులు పాల్గొన్నారు.