నిర్మల్ అర్బన్, డిసెంబర్ 12 : గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణంలో 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8080 మంది అభ్యర్థు లు హాజరవుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలపై శిక్షకులు రవికుమార్, పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోపరీక్షల కో-ఆర్డినేటర్ పీజీ రెడ్డి, డిపార్ట్మెంట్ అధికారులు గోవింద్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, అంబాజి, రమణ, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, సుదర్శన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 12 : కవ్వాల్ టైగర్ జోన్‌లోని పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో పునరావాస గ్రామాలైన రాం పూర్, మైసంపేట్ ప్రజలకు కల్పిస్తున్న వసతులపై గురువారం సాయంత్రం సమావేశం ని ర్వహించారు. పునరావాస గ్రామాల్లో స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకు ని ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ప్రజ ల సంక్షేమంతోపాటు అడవులను రక్షించాలన్నారు. రహదారులు, నివాసాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఎఫ్‌వో నాగినిభాను, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు అశోక్ కుమార్, శంకరయ్య, డీటీడీవో అంబాజీ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ భవానీ శంకర్, అట వీ శాఖ అధికారులు అరుణ్, రాజేందర్, త హసీల్దార్ సుజాత, ఎంపీడీవో అరుణ ఉన్నారు.