ఆసిఫాబాద్ టౌన్ ,డిసెంబర్ 16 : జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 18 సెంటర్లు ఏర్పాటు చేశా రు. 4393 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, ఉదయం 2397 మంది హాజరు కాగా, 19 96 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యా హ్నం 2395 మంది పరీక్ష రాయగా 1998 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలతో పాటు సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలోని సెంటర్‌ను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తనిఖీ చేయగా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద బందోబస్తును ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణకు కృషి చేసిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. రెండు రోజులు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, 54 శాతం మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బీఎన్ఎస్ఎస్163 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
కాగజ్‌నగర్‌లో..
కాగజ్‌నగర్,డిసెంబర్16 : కాగజ్‌నగర్ పట్టణంలోని తొమ్మిది సెంటర్లలో నిర్వహించిన గ్రూపు-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అభ్యర్థులను వాహనాల్లో ఉచితంగా కేంద్రాలకు తరలించారు.