ఉట్నూర్, జూలై 16 : ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో నివసించే గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటారు. జల్, జంగల్, జమీన్ కోసం నాటి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం స్ఫూర్తితో పోరాటం చేస్తున్నా రు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు ఇచ్చా రు సీఎం కేసీఆర్. అది కాక తెలంగాణ రైతులు ధనవంతులు కావాలని తీసుకొచ్చిన ఎకరానికి పదివేల పెట్టుబడి సాయం కూడా ప్రక టించారు. గిరిజన రైతుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక పోడు భూములకు సైతం రైతు బంధు, రైతు బీమా వర్తింపుజేస్తుండ డంతో ఏండ్ల కల నెరవేరిందని గిరిజనులు పేర్కొంటున్నారు.
హక్కుపత్రాలు పొందిన గిరిజనులు
ఆదిలాబాద్ జిల్లాలో 31,683 ఎకరాల భూమికి గిరిజనులకు హక్కు పత్రాలు అందిం చారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 3326 మందికి గానూ 10,843 ఎకరాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2207 మందికి గానూ 4వేల ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 2447 మందికి 6867 ఎకరాలు, బోథ్ నియోజకవ ర్గానికి 4242 మందికి 9956 ఎకరాలు మొత్తం గా 12,222 మందికి గాను 31,683 ఎకరాల భూమిని పంపీణీ చేశారు.
రైతుబంధుతో మేలు
ప్రభుత్వం పెట్టుబడి సాయంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం గిరిజనులకు చాలా ఉపయోగ పడనుంది. ఎందుకంటే ఏజెన్సీలోని గిరిజనుల వర్షాధారిత పంటలపై ఆధారపడి జీవిస్తుంటారు. అధిక వర్షాలు పడ్డ, వర్షాలు లేకున్న కనీసం పెట్టుబడి ఎల్లక గిరిజనులు అప్పుల పాలైన ఘట నలు అనేకం. గతంలో సవుకారుల వద్ద గిరిజనుల అప్పులు చేస్తూ పంటల నష్టంతో చాలా ఇబ్బం దులు పడ్డారు. అదికాక అటవీ భూమికి అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందు లు సైతం ఉండేది. ఒకవైపు హక్కుపత్రాలతో అందడంతో పాటు పాటు ఎకరానికి సంవత్సరా నికి పది వేలు ప్రభుత్వ సాయం అందనుంది. దీంతో సవుకా రులు, దళారుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
అడవుల రక్షణకు చర్యలు
ప్రభుత్వం గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు దట్టమైన అడవుల రక్షణ చర్యలు తీసుకుంటున్న ది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హరితహారం పేరుతో దాదాపు రాష్ట్రంలో 72 కోట్ల మొక్కలు పెంపకం చేపట్టింది. ఈ యేడు రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెంపకానికి అధికారులు చర్య లు చేపడుతున్నారు. అడవులతోనే అధిక వర్షపా తం కురుస్తుందని గ్రహించిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గ్రామాలు నేడు పచ్చతోరణాలుగా మారాయి. దేశంలోనే ఉత్తమ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు ఎంపికయ్యాయి.
సర్కారు పెద్దపీట వేస్తున్నది..
తెలంగాణ ఏర్పడ్డ ప్పటి నుంచి గిరిజ నుల అభివృద్ధి సాధ్య మవుతుంది. గిరిజన గ్రామాలను జీపీలుగా మార్చారు సీఎం కేసీఆర్. దీంతో స్థానిక యువతకే సర్పంచ్‌గా అవకాశం ఏర్పడింది. అక్కడి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. గ్రామాలకు రోడ్లు, మంచినీటి వసతులు, పాఠ శాలలు వచ్చాయి. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. జోడేఘాట్‌లో 25 కోట్లతో మ్యూజియం కట్టి, ఆయన చరిత్రను అందులో పొందుపరిచారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున నివాళులర్పిస్తున్నాం. అలాగే రిజర్వేషన్లు పెంచి గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు.
– ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు
కుమ్రంభీం స్ఫూర్తి గా ప్రభుత్వం గిరిజను లకు అనేక సంక్షేమ పథకాలు అంది స్తున్న ది. జిల్లాలో గిరిజనుల సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది. 2005 ప్రకారం జిల్లా లో సర్వేచేసి అర్హులకు భూములు పట్టాలు అందించాం. ఇందులో హిగంగా జిల్లాలో 31వేల భూమిని 12,222 మందికి అందించాం. ఇది గిరిజనుల 100 సంవత్సరాల పోరాట లక్ష్యాన్ని ప్రభుత్వం నెరవేర్చింది. పోడు భూముల పత్రాలు అందుకున్న వారందరికీ త్వరలోనే రైతుబంధు ఖాతాల్లో జమ చేస్తాం. అవసరమైన బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు తీసుకున్నాం.
– దిలీప్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖఉపసంచాలకుడు (ఉట్నూర్)