భైంసా టౌన్ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నేతాజీనగర్‌లో బంజారాల ఆరాధ్య సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ( Sevalal Jayanti ) వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బంజారాల నాయకులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బంజారాల కుల పెద్దలు అనిల్ రాథోడ్, నాను జాదవ్, మధుకర్, రామ్, విజయ్, సతీష్, కార్తీక్, సరస్వతి, రాజేశ్వరి, శాంతాబాయి, కాంతాబాయి, మేనక తదితరులు పాల్గొన్నారు .