జైపూర్, మే 14 : కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటే రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జైపూర్ మండలం ఇందారంలోని సుముఖ గోదాము, మండల కేంద్రంలోని జయలక్ష్మి రైస్ మిల్ను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. రోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులకు సహకరించాలని తెలిపారు.
సజావుగా కొనుగోలు చేయాలి
లక్షెట్టిపేట, మే 14 : రైతులకు ఇబ్బందుల్లేకుండా సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్కుమార్తో కలిసి రాజరాజేశ్వర రైస్ మిల్ను సందర్శించారు. గాయత్రి రైస్మిల్లో ఏర్పాటు చేసిన గోదామును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని కేటాయించిన మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. అనంతరం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, గోదామును సందర్శించారు.