ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఆదిలాబాద్‌లో ఒలింపిక్ డే రన్ ర్యాలీ
తాంసి, జూన్ 23 : రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దేశంలో రైతన్నల గురించి ఆలోచించిన ప్రభుత్వం, ప్రతి పంటనూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్ జొన్నలను రూ.2,738 చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎకరాకు 10.44 క్వింటాళ్ల జొన్నలకు కొనుగోలు చేస్తారని, 1.31 మెట్రిక్ టన్నులు కొంటామని పేర్కొన్నారు. జొన్నల కొనుగోలుకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని, ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెడుతుందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పండించే పంటలకు మద్దతు ధర పెంచుతూ.. ఇతర రాష్ర్టాల్లో తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని రైతులు గుర్తించాలని సూచించారు. కొన్ని చిల్లర పార్టీలు జొన్నల కొనుగోలు విషయంలో రాద్ధాంతం చేశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ప్రతి పంటనూ కొనుగోలు చేస్తున్నదని అన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్ఢి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు సాజిద్‌ఖాన్ పాల్గొన్నారు.
రైతుల కోసం కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు..
జైనథ్, జూన్ 23 : రైతులకోసం కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. జైనథ్‌లోని మార్కెట్‌యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటల్లో కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్నారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రైతులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్, నాయకులు పుండ్రు వెంకట్‌రెడ్డి, గడ్డం జగదీశ్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ పెందూర్ దేవన్న, సుదర్శన్, రైతులు పాల్గొన్నారు.
బేల సబ్ మార్కెట్ యార్డులో..
బేల, జూన్ 23 : బేల సబ్‌మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, పీఏసీఎస్ చైర్మన్లు జితేందర్, బాల్‌చందర్, నాయకులు మస్కే తేజ్రావ్, దేవన్న, తన్వీర్‌ఖాన్, విపిన్ ఖోడే, ఆయా గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో షెడ్లు ప్రారంభం
మండలంలోని గణేశ్‌పూర్ గ్రామంలో సవారీ బంగ్లా నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమిపూజ చేశారు. ఖడ్కి గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ షెడ్‌ను మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రతి గ్రామాల్లో ఉన్న విభిన్న సంస్కృతులు, అన్ని కులాలను గౌరవిస్తూ వారికి కావాల్సిన మందిరాలు, సవారీ బంగ్లా షెడ్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, ప్రమోద్‌రెడ్డి, జక్కుల మధుకర్, తన్వీర్‌ఖాన్, ఇంద్రశేఖర్, బండి సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, ఎంపీటీసీ సకారం, అరుణ్, సర్పంచ్ తుకారాం, పీఆర్ ఏఈ హరీశ్, ఐటీడీఏ ఏఈ సుధాకర్, ఆయా గ్రామాల నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
సర్కారు బడులను బలోపేతం చేస్తాం..
ఆదిలాబాద్ రూరల్, జూన్ 23 : జిల్లాలోని సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలోని యూపీఎస్‌లో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టనున్న రూ.28.88 లక్షల పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ అంజుబాయి, యూ నిస్ అక్బానీ, మాజీ ఎంపీటీసీ సంతోష్ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు ప్రజా సంక్షేమం పట్టదు..
కాంగ్రెస్, బీజేపీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండలంలోని బట్టిసావర్గం జీపీలోని దుబ్బగూడలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సవారీ బంగ్లా, మరో రూ.5 లక్షలతో నిర్మించనున్న మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ దేశంలో నిరుద్యోగులను పెంచుతుందన్నారు. డీసీసీబీ చై ర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ రాగం గంగమ్మ, నాయకు లు నల్లా రాజేశ్వర్, చందాల రంగన్న, గోవర్ధన్, దర్శనాల ఏవన్, కిరణ్, గణపతి రెడ్డి, మల్లేశ్, రవి పాల్గొన్నారు.