టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి
లింగాపూర్, జూలై 7 : మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని ఘుంనూర్(కే) ప్రాథమిక పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభు త్వం భావిస్తోందని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ ఆడే సవితా, వైస్ ఎంపీపీ ఆత్మారాం, ఈఈ అశోక్‌కుమార్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ గౌడ్, ఎంఈవో సుధాకర్, సర్పంచ్ కనక జ్యోతిరాం, నాయకులు ఆత్రం అనిల్‌కుమార్, జాటోత్ రాహుల్, ఆత్రం శేషు ఉన్నారు.