భైంసా, మే 24 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి సోషల్ మీడియా వారియర్లు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ బ్యాంకెట్ హాల్లో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాట వేస్తుందన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, నిరుద్యోగులకు రూ.4 వేలు, పెన్షన్ రూ.4 వేలు, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీలు అమలు కావడం లేదన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు విలాస్ గాదేవార్, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, రాము, దశరథ్, శ్యాం, పోశెట్టి, కపిల్, సురేశ్, వాసే, అజీజ్ ఖురేషి, సజన్ పాల్గొన్నారు.