మంచిర్యాల, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని చెత్త రాజకీయం.. థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సు మన్ అన్నారు. మంచోైళ్లెన జిల్లా ప్రజలను గడ్డం బ్రదర్స్(గడ్డం వినోద్, వివేక్) కలుషితం చేస్తున్నారంటూ మండిపడ్డారు. శనివారం క్యాతన్‌పల్లిలో ని తన ఇంటిలో చెన్నూర్ ప్రగతి ప్రస్తానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేల కోట్ల ఆస్తులున్న వారు కావాలో.. నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్లు తీసుకొచ్చిన నేను కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. చేసిన అభివృద్ధి, అమలు చేయబోయే మ్యానిఫెస్టోను చూపించి ఓట్లు అడిగే దమ్ములేక.. నాయకులకు ప్యాకేజీలు ఇస్తూ, మొత్తం ఆర్రస్ పాటపాడినట్లే పాడి కొంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తుందన్నారు.
వాళ్లకు వేలకోట్ల ఆస్తులున్నయ్ ఇవ్వ గలుగుతారని, కానీ నేను ఇవ్వలేనన్నారు. కేసీఆర్ శిష్యుడిగా నేను సీఎం, మంత్రులు, అధికారుల చు ట్టూ తిరిగి వేల కోట్ల నిధులు తీసుకురాగలనుకానీ.. నాయకులకు కోట్లు ఇ చ్చుడు నాతోని కాదు. అంతిమంగా నేను ప్రజలను కోరుతున్నానని, ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, వేల కోట్ల ఆస్తులున్న ఆయన కావాలా.. వేల కోట్ల నిధులు తెచ్చిన నేను కావాలా.. ప్ర జలే తేల్చాలన్నారు. డబ్బు రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నిలకడ, నిబద్ధత, నీతీ నిజాయితీ లేనోళ్లు ఎన్ని పార్టీలైనా మారుతారన్నారు. ఒక్క టికెట్ కోసం కాంగ్రెస్‌కు రూ.100 కోట్లు ఇచ్చినట్లు సోషల్‌మీడియాలో నేను కూడా చూశానన్నారు. ఎక్కడికి పోతున్నయ్ రాజకీయాలు.. ఏమైతుంది ప్రజాస్వామ్యం ఆలోచించాలన్నారు.
గతంలో వాళ్లు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారని, సుమారు 35 ఏండ్లు వాళ్లు ఈ ఏరియాలోనే ఉన్నారన్నారు. వాళ్ల హయాంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు తెచ్చారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. నేను ఇవాళ రూ.1658 కోట్లతో చెన్నూర్‌లో లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టానన్నారు. రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నేను పెట్టిస్తున్నానని, వాళ్లకు కూడా ఎన్నో సంస్థలు ఉన్నాయని, మరి ఒక్క ఫ్యాక్టరీ అన్న చెన్నూర్‌లో ఎందుకు పెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టరు కానీ, వాళ్లకు ఉద్యోగం కావడం కోసం వచ్చి ఇక్కడ పోటీ చేస్తారా అంటూ నిలదీశారు.
ప్రాణం పెట్టి, చెమట కష్టం పెట్టి, రక్తం పెట్టి నియోజకవర్గాల కోసం అటు దుర్గం చిన్నయ్య, ఇటు నేను కష్టకాలంలో పనిచేశామన్నారు. కరోనా, ఆర్థిక మాధ్యంలోనూ నియోజకవర్గాల కోసం తల్లాడిల్లినోళ్లం అని చెప్పుకొచ్చారు. మా నాన్న యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉంటే.. నేను వచ్చి కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి వడ్లు కొనేట్లు చేశానని, ఎన్నడన్న వాళ్లు ఇలాంటి పనులు చేశారేమో ఆలోచించాలన్నారు. వందల మంది ప్రాణాలను బలితీసుకున్న తుంతుంగ వాగు, సుద్దాల వాగు, కిష్టంపేట పెద్దమోరీ, బొక్కలగుట్ట వాగులపై మేము బ్రిడ్జిలు కట్టామని, మరి మీ హయాంలో ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు. ఇప్పుడు మీరు ప్రచారానికి పోతే మేం కట్టిన బ్రిడ్జిల మీది నుంచే పోవాలన్నారు.
ఇటు చెన్నూర్, అటు బెల్లంపల్లిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారని, ఇగ మిగిలిన దళితులు..వేరే వాళ్లు రాజకీయాల్లో ఉండొద్దా అని ప్రశ్నించారు. బెల్లంపల్లిలో అన్న, చెన్నూర్‌లో తమ్ముడు, పెద్దపల్లిలో కొడుకు గుత్త పట్టుకున్నారని.. దళితులందరూ ఆలోచన చేయాలన్నారు. ఈ ఏరియా ఏమైనా వాళ్ల గుత్త ఆధిపత్యమా.. ఎటు పోతుంది… ఏమైతుంది… వేరే వాళ్లు ఉండవద్దా.. వేరే నాయకత్వాలు వద్దా.. వీళ్ల తాతలు, తండ్రులు, కొడుకులు మూడు తరాలు వీళ్లే ఉండాలా.. విజ్ఞులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పైసలు ఉన్నోడే పోటీ చేయాలా.. వేరే వాడు చేయొద్దా… పైసలతోనే ఓట్లా.. పైసలతోనే రాజకీయాలా.. ఎంత మందిని కొంటారు పైసలు పెట్టి, ప్రజలందరినీ కొనగలారా అంటూ మండిపడ్డారు. ఒక్కరు చేరితే ఐదు లక్షలు, పది లక్షలు, పదిహేను లక్షలు, ఆ ఒక్కరూ ఇంకొకరిని తెస్తే ఇంకో పది లక్షలు, ఇంకో ఐదు ఎక్ట్రా.. ఇదేం సంస్కృతో చెప్పాలన్నారు.
ఇలాంటి రాజకీయాలు చాలా బాధాకరమని, ఝహుత్సాహాకరమన్నారు. మీ పార్టీకి ఉన్న మ్యానిఫెస్టో చూపించి, గతంలో చేసిన పని చూపించి ఓట్లు అడగాలి కదా.. ప్యాకేజీలు ఇచ్చుడేందంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై తగిన ఆధారాలు బయటికి తీస్తామని, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కొనుగోలు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంతో చూడాలన్నారు. అన్ని గమనిస్తున్న జనం తగిన సమయంలో తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉందని, ప్రజలనే నమ్ముతున్నామన్నారు. ప్రజలను అభ్యర్థిస్తున్నామే తప్పితే ప్యాకేజీలు ఇచ్చుడు, కొనుడు, అమ్ముడు రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, గడిచిన కొనేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన చెన్నూర్ ప్రగతి ప్రస్తానం పుస్తకాన్ని ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి బాల్క సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చినం, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ కింద ఎన్ని బ్రిడ్జిలు కట్టినం, రూ.1658 కోట్లతో నిర్మించనున్న చెన్నూర్ ఎత్తిపోతల పథకం,రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, మొదటి దశలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం బాగు చేసుకున్న స్కూళ్లు, విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి ఇలా ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ పుస్తకాన్ని అద్భుతంగా రూపొందించామన్నారు. దీన్ని చెన్నూర్ ప్రజానికానికి, మేథావులకు, అడ్వకేట్లకు, టీచర్లకు, డాక్టర్లకు విజ్ఞులైన ప్రతి ఒక్కరి పంపిస్తామన్నారు.
గత పాలకులు, నాయకుల హయాంలో ఏం జరిగింది నియోజకవర్గంలో.. ఇప్పుడు ఏం జరిగిందనేది ప్రజల కండ్ల ముందు ఈ డ్యాకుమెంట్ ద్వారా చూపెడుతున్నామన్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచి కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసిన వారి హయాంలో జరగనంత అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వలో చెన్నూర్‌లో జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే చాలా చేశామని, ఇంకా చాలా చేస్తామని చెప్పారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే, ఈ సంక్షేమ రాజ్యం ఇలాగే ఉండాలంటే చెన్నూర్‌లో మరోసారి కేసీఆర్ నాయకత్వమే ఉండాలని, గులాబీ జెండానే ఎగరాలన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్న మీ ఇంటి బిడ్డ బాల్క సుమన్‌ను గెలిపించాలని ఎంపీ వెంకటేశ్‌నేత కోరారు. జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.