ఇంద్రవెల్లి : తీజ్ ఉత్సవాలను ( Teej Celebrations ) ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బంజారా యువసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సంజీవ్ నాయక్ ( Sanjeev Naik ) డిమాండ్ చేశారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.
లంబాడీ సమాజానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లి కానీ ఆడపడుచులు రాఖీ పౌర్ణిమ నుంచి శ్రీకృష్ణ జన్మష్టామీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీల తీజ్ ఉత్సవాలను అధికారికంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు జాదవ్ సుభాష్, పులిమడుగు గ్రామ నాయక్ ఆడే దినేష్, చవాన్ భావరాజ్, జాదవ్ జ్ఞానేశ్వర్, పాల్గొన్నారు.