భైంసా, మే 19 : హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఉండడం బాధ కలిగిస్తుందన్నారు.
వారి ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు కొందరు ముస్లింలు వారిని రక్షించడానికి వెళ్లి మతసామరస్యాన్ని చాటకున్నారన్నారు. అనంతరం మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు వాసే, కపిల్, మహిపాల్, భీమేశ్, అమీర్, తదితరులు ఉన్నారు.