నార్నూర్ : నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం హిందీ దివస్ ( Hindi Diwas ) ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందీ భాష ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ వెంకట కేశవులు మాట్లాడుతూ హిందీ భాష దేశ సమైక్యత , సౌభాతృత్వాన్ని కాపాడే భాష అని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిందని , ఈ భాషను ప్రతి ఒక్కరు నేర్చుకోవడం ఎంతో అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హిందీ అధ్యాపకులు బాలాజీ కాంబ్లేను శాలువాతో సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకట కేశవులు, ఏజీఎంసీ కే వెంకటరమణ, ఎల్ సుజాత, బి సుజాత, పి ఉదయ్ కుమార , చెదల నరేష్, అజయ్ కుమార్, వరుణ్ రెడ్డి, జే రచన, బోధనేతర సిబ్బంది, గజానంద్, ఆడే కృష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు.