ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడో రోజు గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. తిరుపల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. రెండు రోజుల కిందట గ్యాస్ బుకింగ్ చేయగా సోమవారం వస్తాయని చెప్పిన నిర్వాహకులు ఈరోజు నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు.
మూడు రోజుల నుంచి గ్యాస్ కోసం తిరుగుతున్న అధికారులు ఏజెన్సీ నిర్వాహకులు ఎవరు పట్టించు కోవడంలేదని, మండుటెండలో ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు తెలిపారు. అధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.