Tragedy | ఒకేసారి నలుగురి అంత్యక్రియలు..కన్నీటి సంద్రమైన పార్డి (బీ) గ్రామం
Tragedy | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బీ) గ్రామంలో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer ) మండలం పార్డి (బీ) గ్రామంలో మంగళవారం విషాద ఛాయలు ( Tragedy ) అలుముకున్నాయి. సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో గ్రామానికి చెందిన జీపు డ్రైవర్ తులసిరాం తోపాటు ఆవుల గంగాధర్, తూము సాయిలు, తూము గౌరబాయి ఘటన స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు నాలుగు మృతదేహాలకు గ్రామంలోని స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు (Funeral ) నిర్వహించారు.

మృతుల కుటుంబ సభ్యులకు చెందిన బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతుల్లో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులు కాగా, వాహన డ్రైవర్ తులసీరామ్ మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు. తమ ఆత్మీయులను కడసారి చూసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటితో వీడ్కోలు పలికిన దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది.
నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ, తిరుగుతూ ఉన్న వారు నేడు విగతజీవులుగా మారడాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా విలపించారు. సర్పంచ్ మడి ప్రవీణ్, మాజీ ఎంపీపీ తూమ్ లక్ష్మి, తుమ్ రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ వి రేఖ మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ బోయిడి విట్టల్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు శవయాత్రలో పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

