కాగజ్నగర్ రూరల్, జనవరి 4: మండలంలోని కోసిని పంచాయతీ పరిధి పర్ధాన్గూడ సమీపంలో గత నెల 31న అటవీ జంతువులకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆదె విష్ణు(17) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో బుధవారం రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ సోనియా కేసు వివరాలు వెల్లడించారు. పర్ధాన్గూడకు చెందిన లెండుగూరె హన్మంతు, ఆదె బాపురావు, సోనులె నగేశ్, కొట్రంగి బాపురావు అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చారు.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విష్ణు మృతి చెందాడు. వారి నుంచి రెండు బైక్లు, తీగలు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్పీ సురేశశ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటవీ జంతువుల వేటకు విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.