ఇచ్చోడ, ఆగస్టు 30 : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ జాహెద్ శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జాహెద్కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, తాజా మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, మాజీ ఎంపీటీసీ శివారెడ్డి, బోథ్ తాజా మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్, సాబీర్, గణేశ్, నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల పరిశీలన..
ఇచ్చోడ మండల కేంద్రంలోని బైపాస్ నుంచి రోడ్డు నిర్మాణ పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. వర్షపు నీరు రోడ్డుపై ఆగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. సాయంత్రం లోగా తాత్కాలిక డ్రైన్ ఏర్పాటు చేసి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించాలని తెలిపారు.