లక్షెట్టిపేట, ఆగస్టు 3 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఐబీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ముందంజలో ఉంచాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట చేసిన మోసాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు పట్టుదలతో పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కార్యర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, నాయకులు గోళ్ల రవీందర్, ఆసాది పురుషోత్తం, కల్లు దావిద్, మోటపల్కుల శ్రీనివాస్, రాజిరెడ్డి, మారుతి, తిరుపతి, శ్రీకర్, మహేందర్‌రెడ్డి, చిప్పకుర్తి నారాయణ, ఉమాపతిరావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.