కాసిపేట, నవంబర్ 14 : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ సంప్రదాయాల నడుమ పూజలు చేసి.. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీం జల్, జంగిల్, జమీన్& నినాదంతో నైజాం ప్రభుత్వంతో పోరాటం చేశారని, ఆయన త్యాగం ఫలితంగానే నేడు అడవిబిడ్డలు స్వేచ్ఛగా బతుకుతున్నారని కొనియాడారు.
దివాసీలు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధనకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం యువజన సంఘం అధ్యక్షుడు పెంద్రం హన్మంతు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ప్రవీణ్ నాయక్, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడె జంగు, కొమ్ముల బాపు, ఆత్రం జంగు, మడావి వెంకటేశ్, చిక్రం భీం, రామకృష్ణ, గణపతి, రాందాస్, నాయకులు రాంటెంకి వాస్దేవ్, లంక లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.