మంచిర్యాలటౌన్, అక్టోబర్ 22 : మంచిర్యాల అంటే గిట్టని వాళ్లే ‘మంచి మంచిర్యాల’ సెల్ఫీపాయింట్ అక్షరాలను తొలగించారని, అలాంటి వారికి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఉద యం ఐబీ చౌరస్తాలోని సెల్ఫీపాయింట్ వద్దకు చేరుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మా జీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ పట్టణ సుం దరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ఐటీ జంక్షన్ అభివృద్ధికి నిధులు కేటాయించిందన్నారు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్, ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయని, పట్టణ ప్రగతి నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు.
ఇక్కడ జాతీయ జెండాతో పాటు మంచి మంచిర్యాల సెల్ఫీపాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాముడు మంచిర్యాల ప్రాంతంలో సంచరించినట్లు పురాణాలు చెబుతున్నాయని, పాతమంచిర్యాలలో రామాలయం, మరోవైపు రాముని చెరువు ఉందని, ఇక్కడ నివసించే ప్రజలు మంచివారిగా ఉంటారని, అందుకే ఈ పట్టణానికి మంచిర్యాలగా పేరుపెట్టడం జరిగిందన్నారు. అసాంఘిక శక్తులకు ఇక్కడ చోటు ఉండకూడదని, అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి మంచిర్యాల సెల్ఫీపాయింట్ ఘటనపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు గోగు ల రవీందర్‌రెడ్డి, ఎర్రం తిరుపతి, అక్కూరి సుబ్బ య్య, వంగ తిరుపతి, మొగిలి శ్రీనివాస్, అంకం నరేశ్, శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్, సుంకరి రమేశ్, ఎడ్ల శంకర్, పల్లపు రాజు, బాపు పాల్గొన్నారు.