చెన్నూర్, మే 10 : మోస పూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం చెన్నూర్‌లో నిర్వహించే కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడకు వస్తున్నారని ఆయన తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిందో? ఎవరు పోటీ చేస్తున్నారో? ప్రజలందరికీ తెలుసని, ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడిందో.. ఇప్పుడేం చేస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఆనాడు కేసీఆర్‌ది కుంటుం బ పాలన అన్నారని, మరి ఇప్పుడు గడ్డం కు టుంబం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కాం గ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీని పెట్టి కొట్లాది రూ పాయలను కుమ్మరించి, ప్రజా తీర్పును వాళ్ల కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారు కుటుంబ రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత దళిత నాయకులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు.
గడ్డం ఫ్యామిలీ దుర్మార్గాలకు ఓటు ద్వారా తగిన గు ణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేల కోట్ల ఆస్తులు, డబ్బులు ఉన్నాయనే అ హంకారంతో ఓటుకు రూ. రెండు వేల నుంచి రూ. ఐదు వేల దాకా పంచి గెలవాలని చూస్తున్నారని, ఇప్పటికే ఊరూరికీ మద్యం పంపించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
సౌమ్యుడు, సుదీర్ఘమైన రాజీయ అనుభమున్న, సింగరేణి కార్మికునిగా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా కృషి చేయాలని పిలు పు నిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ మం త్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్, కోటపల్లి వైస్ ఎంపీపీలు వెన్నపురెడ్డి బాపు రెడ్డి, వాల శ్రీనివాస్‌రావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జోడు శంకర్, తుమ్మ రమేశ్, జగన్నాథుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బెల్లకొండ కరుణాసాగర్‌రావు, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మే 10 : జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన స్వగృహంలో బాల్క సుమన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.