బేల, జూలై 5 : నిరుపేదలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోయినా.. అధికార యంత్రాం గం చొరవ చూపి బేల పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండల కేంద్రంలో పీహెచ్సీ భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ప్రారంభానికి నో చుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
ఈ విషయమై ఇటీవల బీఆర్ఎస్ నాయకులు వి లేకరుల సమావేశం నివ్వహించే వరకు మం త్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు చలనం లేదు. దీంతో స్పందించిన జిల్లా అధికారులు పీహెచ్సీ భవనాన్ని ఇటీవల ప్రారంభించడంతో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న శనివారం భవనాన్ని పరిశీలించారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. నూతన భవనంలో కొత్త పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని, అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. అలాగే యోగ నిర్పించడానికి సిబ్బంది ఉన్నా..
ఇకడ వసతులు లేక ఎవరికి నేర్పించలేక పోతున్నామని సిబ్బంది మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిషరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీష్ పవర్, గంభీర్ ఠాక్రే, దేవన్న, మాస్ తేజీరావ్, సునీల్, దీపక్ గౌడ్, ఆకాశ్ ఉన్నారు.