మంత్రుల పర్యటనతో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదు
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రాధా న్యం ఇచ్చి రాష్ట్రంలో 200 మైనార్టీ గురుకులాలలను ఏర్పాటు చేశారన్నారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినా బాలురు, బాలికల మైనార్టీ గురుకులాలను కాంగ్రెస్ మంత్రులు ప్రారంభించడం తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. గురుకులాలను ప్రారంభించిన మంత్రులు విద్యార్థులతో కనీసం మాట్లాడలేదని, విద్యావిధానంపై సమీక్ష నిర్వహించకపోవడం వారి అసమర్థపాలనకు నిదర్శనమన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం రూ.18 కోట్లు మంజూరు చేసి మసీదులు, గ్రీవ్యార్డులు ఇతర కా ర్యక్రమాలను చేపట్టామన్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్ కోసం రూ.4 కోట్లు రావాల్సి ఉందని, జిల్లాలో రూ.14 కోట్లతో మైనార్టీల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాకు వచ్చే మంత్రులు అభివృద్ధి నిధు లు ప్రాజెక్టులు తీసుకురావాలన్నారు. మైనార్టీ నాయకులు యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సలీం పాషా, ఎజాజ్, ఆసిఫ్, జమిల్, సూర్యాకాంత్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

