బేల, అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రైతుబంధు ఆగిపోతుందన్న గులాబీ దళపతి కేసీఆర్ మాట లు నిజమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. ఈనెల 24న ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే కేటీఆర్ నిరసన సభకు రైతాంగం కదిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివా రం బేల మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సభకు భారీ ఎత్తున ప్రజానీకాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ.. ఎమ్మె ల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించలేడని విమర్శించారు. తన స్వార్థం కోసం కాంగ్రెస్ మంత్రులకు సన్మానాలు చే యడం మానుకుని రైతుల పక్షాన పోరాడాల ని సూచించారు. రైతు భరోసాకు డబ్బులు ఇ వ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నదని విమర్శించా రు. అన్నదాతల సంక్షేమమే బీఆర్ఎస్ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఆయన వారికి న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, దేవన్న, అరుణ్, జక్కుల మధూకర్, తన్వీర్ ఖాన్, సుదర్శన్, మస్క తేజరావ్, ప్రవీణ్ పాల్గొన్నారు.