ఎదులాపురం,ఏప్రిల్4: సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభమైతే జిల్లా ముఖ చిత్రం మారనుందని, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని మాజీ మం త్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పునరుద్ధరనే ధ్యేయంగా ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ వద్ద 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో సమితి సభ్యులు ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఫ్యాక్టరీ ఆవశ్యకతను వివరించారు. వెంటనే సీసీఐని పునః ప్రారంభించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో శుక్రవారం దీక్షల్లో పాల్గొన్న సాధన కమిటీ నాయకులు, సభ్యులకు జోగురామన్న నిమ్మర సం అందించి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భం గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మాట్లాడుతూ…సీసీఐ పునః ప్రారంభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మార్లు కేంద్ర మంత్రులను కలిశామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పటికీ అన్ని విధాలా తమ వంతు సహకారం అందిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వందేళ్లకు సరిపడా ముడిసరుకు కలిగిన ఫ్యాక్టరీ ప్రారంభమైతే జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని, స్థానికులకు ఉపాధి దొరుకుంతుందని పేరొన్నారు. ఈ విషయమై సాధన సమితి సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లామని తెలిపారు. ఎంపీ గోడం నగేశ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా..అహంకారపూరితం గా సమాధానాలివ్వడం సరికాదన్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆవశ్యకతను వివరిస్తే అయన సానుకూలంగా స్పందిం చి..ఆరు నెలల్లో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్పష్టత ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేరొన్నారు.
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆదిలాబాద్ భవిష్యత్‌ను రియల్ ఎస్టేట్‌గా మార్చుకుంటున్నారని ఆరోపించారు. సీసీఐ సాధన కమిటీ ద్వారా చే పట్టిన ఉద్యమాలను కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ కమిటీ సభ్యులు విజ్జగిరి నారాయణ టింగని పోశెట్టి, గుడిపెల్లి నగేశ్, కొండ రమేశ్, బొల్లు ఈశ్వర్, ఎస్.అరుణ్ కుమార్,ఉజిగిరి విఠల్ , వెంకట నారయణ,బమాన్ జగన్, బొజ్జ ఆశన్న, దర్శనాల నగేశ్ సిర్ర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
బేల, ఏప్రిల్ 4 : ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ(సీసీఐ)ను పునరుద్ధరించేందుకు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదిలాబాద్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు బేల మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. సీసీఐ పునఃప్రారంభించడంతో జిల్లాకు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీశ్ పవర్, గంభీర్ ఠాక్రే, మాస్ తేజిరావ్, విఠల్ వరాడే, తాన్ బా ఠాక్రే, విపిన్ ఖోడే, విశాల్ పాల్గొన్నారు.