ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలి
జిల్లాలోని బీజేపీకి చెందిన ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మోసపూరిత మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
- ఏఎస్పీకి మాజీ మంత్రి జోగు రామన్న ఫిర్యాదు
ఎదులాపురం, ఏప్రిల్ 10 : జిల్లాలోని బీజేపీకి చెందిన ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మోసపూరిత మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యేపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డీపీవో కార్యాలయంలో ఏఎస్పీ మౌనికను కలిసి ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మరో పక కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందించలేదని పత్రికాముఖంగా తెలిపినప్పటికీ, ముందస్తుగా ఎంపీ, ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలతో ఆదిలాబాద్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఎలాంటి నిజా నిర్ధారణ లేకుండా పత్రికా ముఖంగా ఎమ్మెల్యే పాయ ల్ శంకర్, ఎంపీ నగేశ్ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ను రూపొందించి ఫిబ్రవరి 24న విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల 17న బృందాలతో సర్వే నిర్వహించనున్నట్లు తెలుపడంతో వీరు చేసిన మోసం బయట పడుతుందన్నారు.
ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోగు రామన్న వెంట పట్టణ అధ్యక్షుడు అజ య్, వెనగంటి ప్రకాశ్, ఆత్రం వెంకటేశ్, అన్నె లా వసంత్, అశోక్ స్వామి పందిరి భూమన్న, అనిల్ ధమ్మపాల్, కొండ గణేశ్, బట్టు సతీశ్, సృజన్, దివిటీ రాజు, మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

