దండేపల్లి, జూలై 11: ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌ను మండలంలోని లింగాపూర్‌లోని ఆయన స్వగృహంలో గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వృద్ధాప్యం పైబడడంతో ఇంటి వద్దనే ఉంటున్న గోవింద్ నాయక్‌ను పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బంజారా సేవా సంఘం చేపట్టనున్న కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్, ఆలిండియా బంజారా సేవాసంఘం అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, అసోసియేట్ అధ్యక్షుడు మోహన్‌సింగ్, వర్కింగ్ అధ్యక్షుడు దీప్లాల్ చౌహాన్, నాయకులు తిరుపతి నాయక్, భాస్కర్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ పాల్గొన్నారు.