కాసిపేట, అక్టోబర్ 23 : అనేక అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, అసమర్థ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య స్పష్టం చేశారు. బుధవారం కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీలోని మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి ఆధ్వర్యంలో 62 మంది యువకులు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని, రుణమా ఫీ రూ.2 లక్షలు చేస్తామని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదని, వృద్ధులకు రూ.4000, దివ్యాంగులకు రూ.6000 పింఛన్ ఇస్తామని గద్దెనెకి మోసం చేస్తున్నారని అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పారని, దీనిపై ప్రశ్నించిన వారిని లాఠీలతో, బూటు కాళ్లతో తన్నిస్తున్నారన్నారు. తమను మోసం చేశారంటూ బెల్లంపల్లి నియోజవర్గం కాసిపేట మండలంలో కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు చాలా దౌర్జన్యాలు చేస్తున్నారని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు భయపడవద్దని కార్యకర్తలు, నాయకులకు భరోసానిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాస్దేవ్, కాసిపేట గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, ఉస్కమల్ల గోపాల్, బన్న శ్రీనివాస్, సుధాకర్, శేఖర్, మల్లేశ్, సాయి కిరణ్, మద్దివేని సాయి, గో మాస సచిర్, దుర్గం సుమంత్, చంద్రశేఖర్, యువకులు పాల్గొన్నారు.
దండారీ దర్బార్ పోస్టర్ల విడుదల
కాసిపేట మండలంలోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి గుడిలో ఈ నెల 27న నిర్వహించే ఆదివాసీ దండారీ దర్బార్ పోస్టర్లను ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆడె జంగు, పెంద్రం హన్మంతు, వెడ్మ కిషన్, సోయం సూరు, ఆత్రం జంగు పాల్గొన్నారు.