Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యేకు ఫారెస్టు రేంజ్ అధికారి క్షమాపణ చెప్పాలి
Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.
జైనూర్ : ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi ) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ ( FRO Ramesh ) వెంటనే క్షమాపణ ( Apology ) చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల నాయకులు ,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాధవరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల మాట్లాడారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను అడ్డుకోవద్దని ఎన్నోసార్లు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ఓట్ల కోసమే ఎమ్మెల్యే కోవ లక్ష్మి రాజకీయం చేస్తుందని రేంజ్ అధికారి హేళనగా మాట్లాడారని విమర్శించారు. రేంజ్ ఆధికారి రాజకీయాలు చేయాలని ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీల కండువాలు కప్పి రాజకీయాలు చేయాలని సూచించారు.
ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం , ప్రశ్నించడం ఎమ్మెల్యే బాధ్యత అని పేర్కొన్నారు. రేంజ్ అధికారి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బావ్ రావు, జాదవ్ శ్రవణ్, కుమ్రం శ్యాంరావు, మాజీ సర్పంచ్ మెస్రం నాగోరావు, మడవి నాగోరావు, అమృత్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, నర్సింగ్, భాస్కర్, ఉమాజీ, పోడు రైతులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

