లక్షెట్టిపేట, జూన్ 10 : లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఆహారమందించడం లేదంటూ సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ప్రభుత్వ దవాఖానలో పస్తులు’ పేరిట కథనం ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. సోమవారం దవాఖాన సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ మల్లేశ్‌కు మెమో జారీ చేశారు.
సూపరింటెండెంట్ మాట్లాడుతూ గతేడాది డిసెంబర్లో కూడా మెనూ సరిగ్గా పాటించడం లేదన్న విషయమై సదరు కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేశామని, ఇది రెండోసారి అన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది కూడా ప్రతి రోజూ పేషెంట్స్‌కి ఇచ్చే డైట్ తప్పకుండా పరిశీలించాలని, రెండు రోజుల్లో ఈ విషయమై పూర్తి నివేదిక అందజేయాలని కాంట్రాక్టర్‌తో పాటు సిబ్బందిని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. మరోసారి ఇలాంటివి పునారావృతమయితే కాంట్రాక్టర్‌ను తొలగిస్తామన్నారు.