Home
Adilabad
Flexi Wall Posters And Flags Of Various Parties Displayed In Villages And Towns Were Removed
కోడ్ కూసింది..ఫ్లెక్సీ తొలిగింది..
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వెలసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రాగా, వారు వెంటనే రంగంలోకి దిగారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వెలసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రాగా, వారు వెంటనే రంగంలోకి దిగారు. కోటపల్లి మండలం రాపనపల్లి, కోటపల్లిలో పంచాయతీ సిబ్బందితో కలసి ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

జన్నారంలో తహసీల్దార్ వనజారెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, ధర్మారం, అంబేద్కర్, పొనకల్ చౌరస్తా, భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాటిని తొలగించారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు సిబ్బంది, పంచాయతీ కార్మికులు తొలగిస్తున్నారు. అనుమతులు లేకుండా పార్టీ జెండాలు, బాన్యర్లు ఏర్పాటు చేయవద్దని అధికారులు ఆదేశించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

