తాండూర్ : తాండూర్ ఐబీలో పది రోజుల క్రితం జరిగిన తోపులాటలో ఓ వ్యక్తిపై దాడి ( Attack ) చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తాండూర్ ఎస్సై డీ కిరణ్ కుమార్ (SI D Kirankumar) తెలిపారు. తాళ్లపల్లి సృజన్ గౌడ్ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన రాత్రి తాండూర్ ఐబీ చౌరాస్తాలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.ఈ కేసులో సుభద్రా కాలనీకి చెందిన అనిల్, సాయి, రాజు, నరేష్, హరిని అరెస్ట్ చేశామని, నిఖిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. వీరిపై రౌడీ షీట్లు తెరువనున్నట్లు వెల్లడించారు.