ఇచ్చోడ, ఏప్రిల్ 19 : విద్యుత్ షాక్తో ఐదు ఎడ్లు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కేశవ్పట్నం గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు కింద పడ్డాయి. శనివారం ఉదయం మేతకు వెళ్లిన ఐదు ఎడ్లు విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాయి.
ఎడ్లు విలువ రూ.2 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు షైక్ అలీ, షేక్ ఖలీల్, ఇస్మాయిల్, జుమ్మా, షైక్ ఖమర్ కోరారు.